బాధ్యత గల ఒక అధికారి ఓటర్ల సవరణ(సర్) ప్రోగ్రాంలో నిర్లక్ష్యంగా దురుసుగా ఓటర్లను మరియు విలేకరిని సైతం దురుసుగా ప్రవర్తించిన బిఎల్ఓ పై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక విలేకరులు అధికారులకు ఫిర్యాదు చేసిన సంఘటన ఇది.వివరాల్లోకి వెళితే మండల కేంద్రంలోని కొత్తూరు గ్రామం నందు వార్డులో ఉన్న ఓటర్లను మరియు విలేకరిని ఓటర్ల నమోదు ప్రక్రియలో భాగంగా సమాచారం కోసం ఆ వార్డు బిఎల్ఓ చంద్ర ను ఫోనులో సంప్రదించాలనుకున్న విలేకరిని దురుసుగా మాట్లాడడమే కాకుండా మాట్లాడుతున్నంగనే నిర్లక్ష్యంగా ఫోన్ కట్ చేసిన బిఎల్ఓ పై చర్యలు తీసుకోవాలని బి.మఠం తాసిల్దార్ మరియు ఎంపీడీవోలకు స్థానిక విలేకరుల సంఘం గౌరవ అధ్యక్షుడు ఆవుల దస్తగిరి నాయుడు,అధ్యక్షులు సారె రామానాయుడు,ప్రధాన కార్యదర్శి పత్తి సురేష్ శుక్రవారం ఫిర్యాదు చేయడం జరిగింది.విధి నిర్వహణలో ఉన్నటువంటి బిఎల్ఓ ఆ వార్డులో ఉన్నటువంటి ఓటర్లను సయితం దురుసుగా మాట్లాడటమే కాకుండా యక్ష ప్రశ్నలన్నీ వేసి ఓటర్లను తికమక పరుస్తూ,ఆయనకు సమాధానం చెప్పలేక ఈ ఓటు కూడా మాకు వద్దులే అనేoత విసుగు తెప్పిస్తున్న బి ఎల్ ఓ పై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక విలేకరులు మండల అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలియజేశారు.అదే కాకుండా రామాలయం వద్ద కూర్చుని అందర్నీ అక్కడికే పిలిపించుకొని ఓటర్లను దురుసుగా మాట్లాడుతూ అందరితో వాదనలకు తిరుగుతూ ఉండటాన్ని వారు తీవ్రంగా దుయ్యబుట్టారు.ఇతను సోమిరెడ్డిపల్లె-1 సచివాలయం లో డిజిటల్ అసిస్టెంట్ గా పని చేయుచున్న సమయంలో కూడా అక్కడికి వచ్చిన వారిని కూడా ఇలాగే ప్రవర్తించేవాడని అక్కడ పనిచేయుచున్న కొందరు సమాచారం అందించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బి ఎల్ ఓ చంద్ర పై చర్యలు తీసుకోవాలని వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వారా ఫిర్యాదు చేశారు.




