ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 11 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం కోదండరామాపురం జాతీయ కూడలి వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరుకు చెందిన అక్బర్ తన సహచరుడితో కలిసి సూళ్లూరుపేటలో కొత్త ఆటో కొనుగోలు చేసి స్వస్థలానికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఆటో పూర్తిగా దెబ్బతింది. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా కొంతసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఘటనపై మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆటో బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 11 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కోదండరామాపురం జాతీయ కూడలి వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరుకు చెందిన అక్బర్ తన సహచరుడితో కలిసి సూళ్లూరుపేటలో కొత్త ఆటో కొనుగోలు చేసి స్వస్థలానికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఆటో పూర్తిగా దెబ్బతింది. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా కొంతసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఘటనపై మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

