ఖమ్మం జులై
(పున్నమి న్యూస్ )
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనను స్వాగతిస్తున్నామని, అయితే ప్రజలు ఇప్పుడు మాటలు కాకుండా పనులు కోరుకుంటున్నారని బీజేవైఎం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు అనంతు ఉపేందర్ గౌడ్ అన్నారు.
రైతు ఆశీర్వాద సభ నిర్వహించే నైతిక అర్హత ముఖ్యమంత్రికి లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, మహిళల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ఎంత నిధులు కేటాయించింది? ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది? ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చింది? యువతకు ఎన్ని ఉద్యోగాలు కల్పించిందో ముఖ్యమంత్రి వివరించాలని అన్నారు.
ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాడుతుందని, ప్రభుత్వం చేసే మంచి పనులను స్వాగతిస్తూనే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు.
ఖమ్మం జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందని అనంతు ఉపేందర్ గౌడ్ స్పష్టం చేశారు.



