శ్రీ కాళహస్తి, జులై 09, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తిలోని మోటార్ వాహన తనిఖీ అధికారి (ఎంవీఐ) కార్యాలయంలో గురువారం చైతన్య పాఠశాల విద్యార్థులకు రవాణా శాఖ విధులు, రహదారి భద్రతా నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలకు చెందిన 130 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోటార్ వాహన తనిఖీ అధికారి దామోదర్ నాయుడు మాట్లాడుతూ, రహదారి భద్రతపై చిన్న వయసు నుంచే అవగాహన పెంపొందించుకోవడం ప్రతి విద్యార్థికి అవసరమని తెలిపారు. కార్యాలయంలో వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ, లెర్నింగ్, శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్‌ల మంజూరు ప్రక్రియలను విద్యార్థులకు వివరించి, డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించే ట్రాక్‌ను పరిశీలింపజేశారు. విద్యార్థులు రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో తల్లిదండ్రులతో పాటు తామూ హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించాలని సూచించారు. రహదారిపై ఎడమవైపు నడవడం, రోడ్లపై ఆటలు ఆడకపోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని హితవు పలికారు. 18 సంవత్సరాలు నిండని మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చైతన్య పాఠశాల ఉపాధ్యాయులు, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన