శ్రీ కాళహస్తి, జులై 09 : (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు గ్రామానికి చెందిన గాండ్ల శివ కుమార్ ఆకస్మిక మరణం పట్ల మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏర్పేడులోని మృతుడి నివాసానికి చేరుకున్న ఆయన, శివ కుమార్ పార్థివదేహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. శివ కుమార్ ఆకస్మిక మృతి వారి కుటుంబానికి తీరని లోటని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెప్పారు. ఈ నివాళులర్పించిన వారిలో కిశోర్ రెడ్డి, రమణయ్య యాదవ్, బత్తి శెట్టి, శివ, నాగార్జున రెడ్డి, రాజేంద్ర, నవీన్, నరేష్ తో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

గాండ్ల శివ కుమార్ భౌతికకాయానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి