Thursday, 9 July 2026
  • Home  
  • అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించి నిత్యావసర సరుకులు అందజేసిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించి నిత్యావసర సరుకులు అందజేసిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ. పోలవరం మండలం గుత్తినదీవి గ్రామంలోని కరవాకులంకకు చెందిన తాళ్ల సత్యవతి నివాసంలో ఇటీవల సంభవించిన అగ్నిప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమై తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలుసుకున్న శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా తాళ్ల సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం ద్వారా ఉచితంగా ఇంటి నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి నిత్యావసర సామాగ్రి అందించారు.అగ్నిప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబానికి తగిన సహాయం అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.అనుకోని ప్రమాదంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వం తమకు అండగా నిలుస్తాయని దాట్ల సుబ్బరాజు భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, సాగిరాజు సూరిబాబు రాజు , కాకర్లపూడి రాజేష్ , పురుషోత్తం , ఎస్సై , తహసీల్దార్ , స్థానిక నాయకులు, అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ఐ. పోలవరం మండలం గుత్తినదీవి గ్రామంలోని కరవాకులంకకు చెందిన తాళ్ల సత్యవతి నివాసంలో ఇటీవల సంభవించిన అగ్నిప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమై తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలుసుకున్న శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా తాళ్ల సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం ద్వారా ఉచితంగా ఇంటి నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి నిత్యావసర సామాగ్రి అందించారు.అగ్నిప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబానికి తగిన సహాయం అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.అనుకోని ప్రమాదంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వం తమకు అండగా నిలుస్తాయని దాట్ల సుబ్బరాజు భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, సాగిరాజు సూరిబాబు రాజు , కాకర్లపూడి రాజేష్ , పురుషోత్తం , ఎస్సై , తహసీల్దార్ , స్థానిక నాయకులు, అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.