ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కార్యవర్గం జిల్లా విద్యాశాఖ అధికారి పి.నాగేశ్వరావును కలిసి పలు కీలక అంశాలపై వినతిపత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇటీవల విడుదల చేసిన మార్క్స్ మెమోపై కోనసీమ జిల్లా అని ముద్రించడం దురదృష్టకరమని సత్వరమే మీ ద్వారా ప్రభుత్వానికి విషయాన్ని తెలియజేసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ముద్రించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని విద్యాలయాల నేమ్ బోర్డుల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ఉండేలా చర్యలు తీసుకోవాలని,అందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేయాలని, మరియు ప్రధానోపాధ్యాయులు ఉపయోగించే స్కూల్ స్టాంప్స్ పై జిల్లా పేరును డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ముద్రించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
విద్యాశాఖలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు ప్రమోషన్ కొరకు స్టడీ లీవ్ కొరకు దరఖాస్తు చేస్తున్న సందర్భంలో వారి స్టడీ లీవ్ కు ఆటంకం లేకుండా ఆ పాఠశాలలో ఆల్టర్నేట్ ఉపాధ్యాయులను నియమించి, వారికి త్వరితగతినే స్టడీ లీవ్ కు సిఫార్సు చేయవలసిందిగా మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వవలసిందిగా కోరారు. విద్యాశాఖలో పనిచేసి మరణించిన ఉపాధ్యాయుల పిల్లలకు త్వరితగతనే కారుణ్య నియామకాలు ఇప్పించుటకు కృషిచేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం ఎస్/16 భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉద్యోగులు పనిచేసే సంస్థ, ఎక్కువమంది ఉపాధ్యాయులు ఈ సంఘంలో పనిచేస్తున్నారు. కావున జిల్లా విద్యాశాఖ అధికారి వారు ఆధీనంలో జరిగే కోఆర్డినేషన్ సమావేశాలకు సంఘ సభ్యులను ఆహ్వానించాలని కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారి సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చినట్లు అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గోసంగి బంగార్రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల రమేష్ బాబు, గౌరవ అధ్యక్షులు ఎం.ఏ.కే భీమారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి గెడ్డం ప్రదీప్, ముమ్మిడివరం మండల శాఖ అధ్యక్షులు మట్టా శ్రీనివాసరావు, సాధనాల సత్యనారాయణ, జనిపల్లి భీమారావు, దీపాటి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

డి ఈ ఓ కు వినతి పత్రం సమర్పించిన ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్,
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కార్యవర్గం జిల్లా విద్యాశాఖ అధికారి పి.నాగేశ్వరావును కలిసి పలు కీలక అంశాలపై వినతిపత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇటీవల విడుదల చేసిన మార్క్స్ మెమోపై కోనసీమ జిల్లా అని ముద్రించడం దురదృష్టకరమని సత్వరమే మీ ద్వారా ప్రభుత్వానికి విషయాన్ని తెలియజేసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ముద్రించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని విద్యాలయాల నేమ్ బోర్డుల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ఉండేలా చర్యలు తీసుకోవాలని,అందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేయాలని, మరియు ప్రధానోపాధ్యాయులు ఉపయోగించే స్కూల్ స్టాంప్స్ పై జిల్లా పేరును డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ముద్రించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. విద్యాశాఖలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు ప్రమోషన్ కొరకు స్టడీ లీవ్ కొరకు దరఖాస్తు చేస్తున్న సందర్భంలో వారి స్టడీ లీవ్ కు ఆటంకం లేకుండా ఆ పాఠశాలలో ఆల్టర్నేట్ ఉపాధ్యాయులను నియమించి, వారికి త్వరితగతినే స్టడీ లీవ్ కు సిఫార్సు చేయవలసిందిగా మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వవలసిందిగా కోరారు. విద్యాశాఖలో పనిచేసి మరణించిన ఉపాధ్యాయుల పిల్లలకు త్వరితగతనే కారుణ్య నియామకాలు ఇప్పించుటకు కృషిచేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం ఎస్/16 భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉద్యోగులు పనిచేసే సంస్థ, ఎక్కువమంది ఉపాధ్యాయులు ఈ సంఘంలో పనిచేస్తున్నారు. కావున జిల్లా విద్యాశాఖ అధికారి వారు ఆధీనంలో జరిగే కోఆర్డినేషన్ సమావేశాలకు సంఘ సభ్యులను ఆహ్వానించాలని కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారి సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చినట్లు అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గోసంగి బంగార్రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల రమేష్ బాబు, గౌరవ అధ్యక్షులు ఎం.ఏ.కే భీమారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి గెడ్డం ప్రదీప్, ముమ్మిడివరం మండల శాఖ అధ్యక్షులు మట్టా శ్రీనివాసరావు, సాధనాల సత్యనారాయణ, జనిపల్లి భీమారావు, దీపాటి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

