నందిపేట్ మండలం కంఠం (PS-156) బూత్ లెవెల్ అధికారి రాష్ట్రస్థాయిలో రికార్డు సృష్టించారు.
SIR-2026 కార్యక్రమంలో 100 శాతం పనులు పూర్తి చేసి రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచారు. ఆర్మూర్ అసెంబ్లీ పరిధిలో సాధించిన ఘనతకు సబ్-కలెక్టర్ ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ప్రశంసాపత్రం అందజేశారు. విధి నిర్వహణలో ఆయన చూపిన అంకితభావం ఇతర అధికారులకు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు.



