ఖమ్మం జులై
భారతీయ జనతా పార్టీ ఖమ్మం రెండో పట్టణ అధ్యక్షుడు ధనియాకుల వెంకట్ నారాయణ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన SIR (Special Intensive Revision) కార్యక్రమంలో ప్రతి బీజేపీ నాయకుడు, కార్యకర్త చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే ఖమ్మం రెండో పట్టణ పరిధిలోని 15 డివిజన్లలో భారతీయ జనతా పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.
సంస్థ బలోపేతంతో పాటు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో సీనియర్ నాయకులు మండదాపు సుబ్బారావు, వేల్పుల సుధాకర్, దాసరి వీరభద్రం, వల్లభనేని పుల్లయ్య, సురేష్, రుద్రగాని మాధవ తదితరులు పాల్గొన్నారు.



