ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం ఐ.ఎస్. జగన్నాధపురం గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన గోపాలపురం ఎమ్మెల్యే శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారు.
అనంతరం రూ.3.70 కోట్ల వ్యయంతో కొనసాగుతున్న ఆలయ అభివృద్ధి పనులను క్షుణ్ణంగా పరిశీలించి, పనులు నాణ్యతా ప్రమాణాలతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేశారు.
ప్రత్యేకంగా సుందరగిరి పర్వతం అడుగు భాగం నుంచి ఆలయం వరకు నిర్మిస్తున్న ఘాట్ రోడ్డు పనులను పరిశీలించి, భక్తులకు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించేలా అత్యుత్తమ ప్రమాణాలతో పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లంక సత్యనారాయణ గారు, రేగంటి రాంబాబు గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు ముత్తింటి సత్యనారాయణ గారు, రాచమంటి శ్రీనివాసరావు గారు, ఉందుర్తి రమణమహర్షి గారు, ముత్తింటి రాంబాబు గారు, కూటమి నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


