*బొమ్మలరామారం మండలంలో పలువురికి రాజ్యాధికార సమరభేరి ఆహ్వాన పత్రికలు అందజేయడానికి వచ్చిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజిని కుమార్ యాదవ్కు ఘన స్వాగతం*
*జులై 05న భువనగిరిలో* తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న *రాజ్యాధికార సమరభేరి బహిరంగ సభకు* సంబంధించి బొమ్మలరామారం మండలంలోని పలువురు ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేసేందుకు మండల పర్యటనకు వచ్చిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సమరభేరి సభ బొమ్మలరామారం మండల ఇన్చార్జ్ *మాధం రజిని కుమార్ యాదవ్* గారికి బొమ్మలరామారం మండల తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు *శ్రీనాథ్ గౌడ్* ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి సన్మానించారు.
ఈ సందర్భంగా రాజ్యాధికార సమరభేరి సభను విజయవంతం చేయడానికి మండల స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులు చర్చించారు. బహుజన వర్గాలందరూ *పెద్ద ఎత్తున సభకు* హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
*ఈ కార్యక్రమంలో పోలు రాజు, మార్త శ్రీనివాస్, సదయ్య,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లావుడ్య లోజన్ నాయక్, రాములు గౌడ్, నరేష్, బాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.*


