ఖమ్మం, జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )
ఏరువాక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రైతు సోదరులకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పుడమి తల్లిని పూజిస్తూ వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టే పవిత్రమైన పండుగ ఏరువాక పౌర్ణమి అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతే దేశానికి వెన్నెముక అని, రైతు సంక్షేమమే దేశాభివృద్ధికి పునాది అని అన్నారు. ఈ ఏడాది అనుకూల వర్షాలు కురిసి, ప్రతి రైతు సమృద్ధిగా పంటలు పండించి సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. పుడమి తల్లి ఆశీస్సులతో ప్రతి రైతు కుటుంబంలో ఆనందం, ఆర్థికాభివృద్ధి వెల్లివిరియాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి రైతు జీవితంలో ఎల్లప్పుడూ వెలుగులు నిండాలని, వ్యవసాయం లాభసాటిగా మారాలని ఆకాంక్షిస్తూ మరోసారి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.



