ఏటికొప్పాక, పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్:
ఏటికొప్పాక మేజర్ పంచాయతీ కావడంతో SIR కార్యక్రమంలో ఓటర్ల జాబితా సవరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒకే కుటుంబ సభ్యుల పేర్లు వేర్వేరు బూత్‌లలో ఉండటం, దరఖాస్తు ఫారాలు నింపడంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గ్రామ సచివాలయంలో బూత్‌వారీగా ఓటర్ల జాబితాలను అందుబాటులో ఉంచారు.
ప్రతి ఓటరు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీతో సచివాలయానికి వచ్చి తమ వివరాలను పరిశీలించుకుని, అవసరమైతే అక్కడే సవరణలు చేయించుకోవాలని అధికారులు కోరారు. అన్ని పార్టీల BLAలు, సచివాలయ సిబ్బంది, VRAలు ప్రజలకు ఫారాలు నింపడంలో పూర్తి సహాయం అందించనున్నట్లు తెలిపారు.
ఓటర్లందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటు వివరాలను సరిచేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.


