Saturday, 27 June 2026
  • Home  
  • తాళ్లపూడిలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు.. రూ.15 వేల వరకు జరిమానాలు
- తూర్పు గోదావరి

తాళ్లపూడిలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు.. రూ.15 వేల వరకు జరిమానాలు

పున్నమి ప్రతినిధి తాళ్లపూడి జూన్ 26 : తాళ్లపూడి మండలంలో రవాణా శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ కే శివ ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం 1:19 గంటలకు జరిగిన ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న ఆటోలు, ఇతర ట్రాన్స్‌పోర్ట్ వాహనాలపై చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బ్రేక్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కాగితాలు, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, పర్మిట్ వంటి కీలక పత్రాలు లేని వాహనాలకు అక్కడికక్కడే జరిమానాలు విధించడం జరిగిందని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ఒక్కో వాహనానికి రూ.5,000 నుంచి రూ.15,000 వరకు జరిమానా విధించామని, జరిమానా విధించిన ఆటోలను తాళ్లపూడి పోలీస్ స్టేషన్ కు తరలించామని జరిమానా చెల్లించి ఆటోలను విడిపించుకోవాలన్నారు. అంతేకాకుండా పర్మిట్ కండిషన్లు ఉల్లంఘించి, సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే ప్రత్యేకంగా కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రయాణికుల భద్రతే మాకు ముఖ్యం. లైసెన్స్, ఫిట్‌నెస్ లేని వాహనాలు రోడ్డెక్కితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రతి డ్రైవర్ తన వద్ద అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉంచుకోవాలి. ఇకపై ప్రతిరోజూ తనిఖీలు కొనసాగుతాయనీ, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవు అని ఆయన హెచ్చరించారు. వాహనదారులంతా వెంటనే తమ పత్రాలను రెన్యువల్ చేసుకోవాలని, ఆర్టిఏ ఆఫీసులో పెండింగ్ పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు.

పున్నమి ప్రతినిధి తాళ్లపూడి జూన్ 26 : తాళ్లపూడి మండలంలో రవాణా శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ కే శివ ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం 1:19 గంటలకు జరిగిన ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న ఆటోలు, ఇతర ట్రాన్స్‌పోర్ట్ వాహనాలపై చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా బ్రేక్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కాగితాలు, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, పర్మిట్ వంటి కీలక పత్రాలు లేని వాహనాలకు అక్కడికక్కడే జరిమానాలు విధించడం జరిగిందని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ఒక్కో వాహనానికి రూ.5,000 నుంచి రూ.15,000 వరకు జరిమానా విధించామని, జరిమానా విధించిన ఆటోలను తాళ్లపూడి పోలీస్ స్టేషన్ కు తరలించామని జరిమానా చెల్లించి ఆటోలను విడిపించుకోవాలన్నారు. అంతేకాకుండా పర్మిట్ కండిషన్లు ఉల్లంఘించి, సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే ప్రత్యేకంగా కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రయాణికుల భద్రతే మాకు ముఖ్యం. లైసెన్స్, ఫిట్‌నెస్ లేని వాహనాలు రోడ్డెక్కితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రతి డ్రైవర్ తన వద్ద అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉంచుకోవాలి. ఇకపై ప్రతిరోజూ తనిఖీలు కొనసాగుతాయనీ, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవు అని ఆయన హెచ్చరించారు.
వాహనదారులంతా వెంటనే తమ పత్రాలను రెన్యువల్ చేసుకోవాలని, ఆర్టిఏ ఆఫీసులో పెండింగ్ పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.