Monday, 22 June 2026
  • Home  
  • సేవే లక్ష్యంగా.. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఘనంగా సేనా ఫౌండేషన్ అన్నదాన కార్యక్రమం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సేవే లక్ష్యంగా.. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఘనంగా సేనా ఫౌండేషన్ అన్నదాన కార్యక్రమం

నెల్లూరు: సేనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాంధీబొమ్మ సమీపంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత ఐదు సంవత్సరాలుగా ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ పేరుతో సేవా భావాన్ని ముందుకు తీసుకెళ్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అద్దేపల్లి ప్రవీన్ మరియు ఆయన మిత్రబృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నాయకుడు కిషోర్ గునుకుల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఎప్పుడూ సేవా దృక్పథానికే ప్రాధాన్యత ఇస్తారని, పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసే కార్యకర్తలే పార్టీకి నిజమైన బలమని పేర్కొన్నారు. కోట్లాది మంది ప్రజలు జనసేన పార్టీకి మద్దతుగా ఉన్నారని, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవ చేస్తే కార్యకర్తలకు, నాయకులకు మంచి గుర్తింపు లభిస్తుందని అన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం మరింత బలోపేతం అవుతున్న తరుణంలో కొత్త కమిటీల్లో అవకాశం పొందిన ప్రతి ఒక్కరూ ప్రజాసేవలో ముందుండాలని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పార్టీ ప్రణాళికల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి మరింత చేరువ కావడం జనసేన కార్యకర్తల బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేనా ఫౌండేషన్ సభ్యులతో పాటు జనసేన నాయకులు కిషోర్ గునుకుల, ప్రశాంత్ గౌడ్, వేముల శివకృష్ణ, రాఘవ, హర్ష, శివచంద్ర యాదవ్, నాగేంద్ర బాలు, వర్షన్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అన్నదాన సేవను విజయవంతం చేసారు.. Uploaded Video:

నెల్లూరు: సేనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాంధీబొమ్మ సమీపంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత ఐదు సంవత్సరాలుగా ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ పేరుతో సేవా భావాన్ని ముందుకు తీసుకెళ్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అద్దేపల్లి ప్రవీన్ మరియు ఆయన మిత్రబృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నాయకుడు కిషోర్ గునుకుల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఎప్పుడూ సేవా దృక్పథానికే ప్రాధాన్యత ఇస్తారని, పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసే కార్యకర్తలే పార్టీకి నిజమైన బలమని పేర్కొన్నారు. కోట్లాది మంది ప్రజలు జనసేన పార్టీకి మద్దతుగా ఉన్నారని, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవ చేస్తే కార్యకర్తలకు, నాయకులకు మంచి గుర్తింపు లభిస్తుందని అన్నారు.

పార్టీ సంస్థాగత నిర్మాణం మరింత బలోపేతం అవుతున్న తరుణంలో కొత్త కమిటీల్లో అవకాశం పొందిన ప్రతి ఒక్కరూ ప్రజాసేవలో ముందుండాలని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పార్టీ ప్రణాళికల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి మరింత చేరువ కావడం జనసేన కార్యకర్తల బాధ్యత అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సేనా ఫౌండేషన్ సభ్యులతో పాటు జనసేన నాయకులు కిషోర్ గునుకుల, ప్రశాంత్ గౌడ్, వేముల శివకృష్ణ, రాఘవ, హర్ష, శివచంద్ర యాదవ్, నాగేంద్ర బాలు, వర్షన్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అన్నదాన సేవను విజయవంతం చేసారు..

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.