ఖమ్మం, జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )
నీట్ (NEET) పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులందరికీ బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఆదివారం నిర్వహిస్తున్న ఈ కీలక పరీక్షలో విద్యార్థులు ఎలాంటి ఆందోళన, ఒత్తిడికి లోనుకాకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా పరీక్ష రాయాలని కోరారు.
వైద్య విద్యలో ప్రవేశానికి అత్యంత కీలకమైన ఈ పరీక్ష కోసం విద్యార్థులు ఎంతోకాలంగా శ్రమించారని పేర్కొన్న ఆయన, తమ కృషి, పట్టుదలపై నమ్మకం ఉంచి అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో సుమారు 208 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 2.95 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.
విద్యార్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకుని, పరీక్షా నిబంధనలు పాటిస్తూ ప్రశాంతమైన మనసుతో పరీక్ష రాయాలని సూచించారు.
విద్యార్థులందరూ తమ లక్ష్యాలను సాధించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గల్లా సత్యనారాయణ ఆకాంక్షించారు.



