*
పద్మనాభం కస్తూరి బా గాంధీ స్కూల్ లో పదవ తరగతిలో ప్రతిభ సాధించిన పిల్లలకు జై జవాన్ ఫౌండేషన్ నగదు బహుమతి మరియు షీల్డ్స్ అందజేత
పద్మనాభం మండలం కస్తూరి బా గాంధీ స్కూల్ చదువుకున్న 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన పిల్లలకు మరియు ఐఐఐటి లో సీట్లు సాధించిన పిల్లలకు జై జవాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ షీల్డ్ నగదు బహుమతి 5000 రూపాయలు సాలువతో సన్మానించారు ఈ యొక్క కార్యక్రమంలో జై జవాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజశేఖర్ మాట్లాడుతూ మంచి ఉత్తీర్ణత సాధించి త్రిబుల్ ఐటీ లో సీట్లు సాధించినందుకు సంతోషంగా ఉందని కార్పొరేట్ స్కూల్లో కంటే ప్రభుత్వ పాఠశాలలోనూ కస్తూరి బా. గాంధీ స్కూల్ పర్సంటేజ్ అత్యధిక మార్కులు రావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు ముందు ముందు పిల్లలు అందరూ కూడా కష్టపడి చదివి జీవితంలో ఒక ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని అనేక రంగాల్లో బాలికలు ముందుండాలని భేటీ పడో దేశ బచావో అనే నినాదంతో పిల్లలందరిలోనూ ఉత్సాహం నింపారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భీమిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురిమిన రామస్వామి నాయుడు మాట్లాడుతూ ముందు ముందు మంచి రిజల్ట్ తీసుకొచ్చి ఉపాధ్యాయులకు స్కూలుకి మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఈ యొక్క స్కూలుకి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటామని తెలియజేశారు . ఈ యొక్క కార్యక్రమంలో భీమిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురిమిన రామస్వామి నాయుడు భీమిలి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుప్ప రామ లక్ష్మి జై జవాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కుప్ప రాజశేఖర్ ఆనందపురం కస్తూరిబాయ్ స్కూలు కాలేజ్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ కోరుకొండ శివాజీ పద్మనాభం కస్తూరిబాయ్ కాలేజ్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ మోకర శీను కాలేజ్ ప్రిన్సిపల్ గ్రేసీ లిల్లీ మణి పార్వతి కోమలి ,రాజేశ్వరి ఫిజికల్ డైరెక్టర్ దేవి ,ఎన్ని నాయుడు ,మణికంఠ, వర్ధన్ ,తదితరులు పాల్గొన్నారు



