శ్రీ కాళహస్తి, జూన్ 19, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘నొస్టిక్ నాచురల్ ఫ్రూట్ ఐస్‌క్రీమ్ షాప్’ను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి శుక్రవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ నిర్వాహకుడు షోకత్కు ఆమె అభినందనలు తెలియజేస్తూ వ్యాపారాభివృద్ధికి శుభాకాంక్షలు అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కృత్రిమ రంగులు, రసాయనాలు లేకుండా సహజ సిద్ధమైన పండ్లతో తయారుచేసిన ఆరోగ్యకరమైన ఐస్‌క్రీమ్‌లను ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థ ప్రారంభం కావడం అభినందనీయమని అన్నారు. నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ వినియోగదారుల విశ్వాసాన్ని పొందాలని, భవిష్యత్తులో సంస్థ మరింత విస్తరించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అభిమానులు, వ్యాపారవేత్తలు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. కొత్తగా ప్రారంభమైన ఈ షాప్ ప్రజల ఆదరణను పొందుతూ విజయవంతంగా ముందుకు సాగాలని వారు నిర్వాహకుడు షోకత్కు శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీకాళహస్తిలో ‘నొస్టిక్’ ఫ్రూట్ ఐస్‌క్రీమ్ షాప్ ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి