Wednesday, 17 June 2026
  • Home  
  • ముగ్గురు మోసగాళ్ల చేతిలో ఖమ్మం జిల్లా దివాళా తీసింది: కేటీఆర్ విమర్శలు
- ఖమ్మం

ముగ్గురు మోసగాళ్ల చేతిలో ఖమ్మం జిల్లా దివాళా తీసింది: కేటీఆర్ విమర్శలు

ఖమ్మం, జూన్ (పువ్వాడ నాగేంద్ర కుమార్, పున్నమి జిల్లా రిపోర్టర్) ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రుల చేతిలో దివాళా తీసిందని బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్కలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ తమ శాఖలను అడ్డం పెట్టుకుని మంత్రులు అక్రమాలకు పాల్పడ్డారని, ప్రజాసేవను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, సభ్యత్వ నమోదులో ఖమ్మం జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తాతా మధు, వద్దిరాజు రవిచంద్ర, కందాల ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, భానోత్ చంద్రావతి, లింగాల కమల్‌రాజు, పగడాల నాగరాజు, మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం, జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్, పున్నమి జిల్లా రిపోర్టర్)

ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రుల చేతిలో దివాళా తీసిందని బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్కలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ తమ శాఖలను అడ్డం పెట్టుకుని మంత్రులు అక్రమాలకు పాల్పడ్డారని, ప్రజాసేవను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.

బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, సభ్యత్వ నమోదులో ఖమ్మం జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తాతా మధు, వద్దిరాజు రవిచంద్ర, కందాల ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, భానోత్ చంద్రావతి, లింగాల కమల్‌రాజు, పగడాల నాగరాజు, మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.