శ్రీ కాళహస్తి, జూన్ 16, (పున్నమి న్యూస్) : రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే అయినప్పటికీ, బాధ్యతాయుతమైన హోంమంత్రి పదవిలో ఉన్న దళిత మహిళ అనిత గారి ‘మేకప్’ను లక్ష్యంగా చేసుకుని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఒక దళిత మహిళ ఆత్మవిశ్వాసంతో, హుందాగా కనిపిస్తే వైకాపా నేతలకు ఎందుకు అంత అసహనమని నేతలు ప్రశ్నించారు. నాడు ఐటీ శాఖ మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయిన అమర్నాథ్, ఈరోజు ఒక మహిళా ప్రజాప్రతినిధి రూపురేఖలపై మాట్లాడటం ఆయన వంకర బుద్ధికి, రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలోని మహిళలను అసెంబ్లీలో అవమానించినప్పుడే వైకాపా సంస్కృతి ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో చట్టం ఎవరికీ చుట్టం కాదని, తప్పు చేస్తే సొంత పార్టీ వారినైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకునే దమ్మున్న నాయకత్వం తమదని నేతలు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే తప్పు చేసిన కోనేటి ఆదిమూలంను తక్షణమే సస్పెండ్ చేశామని, జగన్ ఇంటి మహిళలపై పోస్ట్ పెట్టిన కిరణ్ కుమార్‌ను కూడా అరెస్ట్ చేయించామని గుర్తు చేశారు. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ‘శక్తి యాప్’, ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. హోంమంత్రి అనిత గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గుడివాడ అమర్నాథ్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని, మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

హోంమంత్రిపై గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు దుర్మార్గం-కూటమి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం