Sunday, 14 June 2026
  • Home  
  • ఏటికొప్పాక హస్తకళల పరిరక్షణకు కృషి చేస్తాం…!
- అనకాపల్లి

ఏటికొప్పాక హస్తకళల పరిరక్షణకు కృషి చేస్తాం…!

కళాకారుల సమస్యలు తెలుసుకున్న రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు రోహిణి ఏటికొప్పాక, (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏటికొప్పాక హస్తకళల అభివృద్ధి, కళాకారుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి రోహిణి పేర్కొన్నారు. గ్రామ పర్యటనలో భాగంగా ఆమె పద్మశ్రీ అవార్డు గ్రహీత సి.వి. రాజును వారి నివాసంలో కలిసి హస్తకళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, మార్కెటింగ్ ఇబ్బందులు, ప్రభుత్వ సహకారం అవసరాలపై వివరాలు తెలుసుకున్నారు. కళాకారుల అభ్యున్నతికి ప్రభుత్వ స్థాయిలో కృషి చేయాలని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కుమారస్వామి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, హస్తకళాకారులు పాల్గొన్నారు. హస్తకళల వారసత్వాన్ని కాపాడేందుకు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

కళాకారుల సమస్యలు తెలుసుకున్న రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు రోహిణి

ఏటికొప్పాక, (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏటికొప్పాక హస్తకళల అభివృద్ధి, కళాకారుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి రోహిణి పేర్కొన్నారు. గ్రామ పర్యటనలో భాగంగా ఆమె పద్మశ్రీ అవార్డు గ్రహీత సి.వి. రాజును వారి నివాసంలో కలిసి హస్తకళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, మార్కెటింగ్ ఇబ్బందులు, ప్రభుత్వ సహకారం అవసరాలపై వివరాలు తెలుసుకున్నారు. కళాకారుల అభ్యున్నతికి ప్రభుత్వ స్థాయిలో కృషి చేయాలని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కుమారస్వామి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, హస్తకళాకారులు పాల్గొన్నారు. హస్తకళల వారసత్వాన్ని కాపాడేందుకు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.