Friday, 12 June 2026
  • Home  
  • నెల్లూరు లో ..ఉయ్యాల కాలువ భీభత్సం మంత్రి ఆదేశాలతో నేతలసహాయక చర్యలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు లో ..ఉయ్యాల కాలువ భీభత్సం మంత్రి ఆదేశాలతో నేతలసహాయక చర్యలు

​ నెల్లూరు నగరంలో గంటపాటు కురిసిన విపరీతమైన వర్షం ఈదురు గాలుల తో 47, 48 డివిజన్లలోని ఉయ్యాల కాలువ కట్ట పొంగి పొర్లి . వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడమే కాకుండా ఇళ్లలోకి కూడా చేరడంతో మంత్రి నారాయణ వెంటనే స్పందించారు.. సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర పట్టణ మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు, 47,48వ డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్ ధర్మవరపు సుబ్బారావు, 47వ డివిజన్ ప్రెసిడెంట్ గణేష్ అధికారులను వెంటబెట్టుకొని డివిజన్ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ, గతంలో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ప్రజలకు నీటి ఇబ్బందులు లేకుండా కాలువలకు వాల్స్ మరియు స్లాబ్ వేసే పనులు చేపట్టడం జరిగిందని గుర్తుచేశారు. అయితే, ప్రస్తుత అకాల వర్షం వల్ల కాలువలు పొంగడంతో పాటు పలుచోట్ల చెట్లు విరిగి ఇళ్లపై, రోడ్లపై పడ్డాయని, నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో మోటార్ల ద్వారా నీటిని తోడేసి, విరిగిపడిన చెట్లను వెంటనే తొలగించేలా మున్సిపల్ సిబ్బందితో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామని తెలిపారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, కాలువ పనులు మరియు రోడ్డు మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా వారు ప్రజలకు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మైనారిటీ నాయకులు షేక్ మహబూబ్ బాషా, వైస్ ప్రెసిడెంట్ మదనంబేటి మునిశేఖర్,బూత్ ఇన్‌చార్జ్‌లు కంచి కృష్ణ, షేక్ రాబియా స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


నెల్లూరు నగరంలో గంటపాటు కురిసిన విపరీతమైన వర్షం ఈదురు గాలుల తో 47, 48 డివిజన్లలోని ఉయ్యాల కాలువ కట్ట పొంగి పొర్లి . వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడమే కాకుండా ఇళ్లలోకి కూడా చేరడంతో మంత్రి నారాయణ వెంటనే స్పందించారు.. సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర పట్టణ మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు, 47,48వ డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్ ధర్మవరపు సుబ్బారావు, 47వ డివిజన్ ప్రెసిడెంట్ గణేష్ అధికారులను వెంటబెట్టుకొని డివిజన్ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ, గతంలో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ప్రజలకు నీటి ఇబ్బందులు లేకుండా కాలువలకు వాల్స్ మరియు స్లాబ్ వేసే పనులు చేపట్టడం జరిగిందని గుర్తుచేశారు. అయితే, ప్రస్తుత అకాల వర్షం వల్ల కాలువలు పొంగడంతో పాటు పలుచోట్ల చెట్లు విరిగి ఇళ్లపై, రోడ్లపై పడ్డాయని, నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో మోటార్ల ద్వారా నీటిని తోడేసి, విరిగిపడిన చెట్లను వెంటనే తొలగించేలా మున్సిపల్ సిబ్బందితో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామని తెలిపారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, కాలువ పనులు మరియు రోడ్డు మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా వారు ప్రజలకు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మైనారిటీ నాయకులు షేక్ మహబూబ్
బాషా, వైస్ ప్రెసిడెంట్ మదనంబేటి మునిశేఖర్,బూత్ ఇన్‌చార్జ్‌లు కంచి కృష్ణ, షేక్ రాబియా స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.