ఓమాన్ తీరానికి సమీపంలో ట్యాంకర్‌పై జరిగిన దాడిలో విశాఖపట్నానికి చెందిన పట్నాల సురేష్ సహా ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. పలావు జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంఎటి సెటెబెల్లో’ నౌకపై దాడి జరగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదట ముగ్గురు సిబ్బంది గల్లంతైనట్లు సమాచారం అందగా, అనంతరం వారి మృతదేహాలను గుర్తించారు. మృతుడు సురేష్ నౌకలో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కుటుంబంలో భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ ఘటన భారత నావికుల భద్రతపై మరోసారి ఆందోళన కలిగించింది.

ఓమాన్ సముద్రతీరంలో ట్యాంకర్‌పై దాడి.. విశాఖకు చెందిన వ్యక్తి మృతి