ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థులకు ఆహ్లాదకర కేంద్రాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదేశం
- పాఠశాలల పునఃప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచన
- కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు ఘన స్వాగతం పలకాలని ఆదేశం
- జూన్ 15న విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు వచ్చేలా ప్రత్యేక చర్యలు
- పాఠశాలల పరిశుభ్రత, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి
- తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని సూచన
- పాఠశాలల ప్రారంభం తర్వాత 15 రోజుల పాటు విద్యార్థుల హాజరుపై ప్రత్యేక పర్యవేక్షణ
- బడి మానేసిన పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశం
- బడిబయట ఉన్న ప్రతి బాలబాలికను బడిలోకి తీసుకురావాలని కలెక్టర్ పిలుపు
- గ్రామస్థాయి సర్వేల ద్వారా డ్రాప్‌అవుట్ విద్యార్థుల గుర్తింపు
- విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, సర్పంచులు సమన్వయంతో పనిచేయాలని సూచన
- మధ్యాహ్న భోజన పథకం అమలుపై నిరంతర పర్యవేక్షణకు ఆదేశం
- విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని కలెక్టర్ వ్యాఖ్య
- ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు భోజనం రుచి చూసి నాణ్యత పరిశీలించాలని సూచన
- విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే విద్యార్థుల అభ్యాస స్థాయి అంచనా వేయాలని ఆదేశం
- నేర్చుకునే లోపాలు ఉన్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలి
- ప్రాథమిక స్థాయిలో చదవడం, రాయడం, గణిత నైపుణ్యాల పెంపుపై దృష్టి
- విద్యార్థుల విద్యా సామర్థ్యాల పెంపే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ స్పష్టం
- ప్రతి విద్యార్థి విద్యా పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచన
- ప్రభుత్వ విద్యా సంస్కరణల ఫలితాలు ప్రతి విద్యార్థికి చేరేలా కృషి చేయాలని ఆదేశం
- విద్యారంగంలో నాగర్‌కర్నూల్ జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ పిలుపు
- మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ సమీక్ష సమావేశం
జిల్లా విద్యాశాఖ అధికారులు, నోడల్ అధికారులు, ప్రధానోపాధ్యాయులు సమావేశంలో పాల్గొన్నారు.



