Thursday, 11 June 2026
  • Home  
  • కూటమి రెండేళ్ల పాలనకు ప్రజల మద్దతే నిదర్శనం- తెదేపా నాయకులు
- తిరుపతి

కూటమి రెండేళ్ల పాలనకు ప్రజల మద్దతే నిదర్శనం- తెదేపా నాయకులు

శ్రీకాళహస్తి, జూన్ 11, (పున్నమి న్యూస్) : వైసీపీ పాలనలో దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. తిరుపతి సమీపంలోని దామినేడు వద్ద నిర్వహించనున్న కూటమి విజయోత్సవ సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సభ ఏర్పాట్లపై చర్చించేందుకు శ్రీకాళహస్తి రూరల్ మండల పరిశీలకుడు, టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి బాలగురుస్వామి ఆధ్వర్యంలో నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్‌తో పాటు సంఘ ప్రతినిధులు బాలగురుస్వామిని దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కాగా, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి అనే రెండు చక్రాలపై ప్రభుత్వం ముందుకు సాగుతూ ప్రజల విశ్వాసాన్ని పొందిందని పేర్కొన్నారు. దామినేడు విజయోత్సవ సభకు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డా. జి. దశరథాచారి, వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, పట్టణ అధ్యక్షుడు విజయకుమార్, ఏఎంసీ ఛైర్మన్ చెంచయ్య నాయుడు, గాలి చలపతి నాయుడు, డా. ఎం. ఉమేష్ రావు, రూరల్ మండల అధ్యక్షుడు కృష్ణ యాదవ్, క్లస్టర్ ఇన్‌చార్జీలు కంఠా రమేష్, గోపీనాథ్, పేట బాలాజీ, మునిరాజా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.