శ్రీకాళహస్తి, జూన్ 11, (పున్నమి న్యూస్) : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి సమీపంలోని దామినేడులో గురువారం నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని సీనియర్ టీడీపీ నాయకుడు, తోటంబేడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు వాడపల్లి జయచంద్ర నాయుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల వేగవంతమైన నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణలో ఎన్డీయే ప్రభుత్వం సమర్థవంతమైన పాలన అందిస్తూ రెండేళ్ల ప్రజారంజక పాలనను పూర్తి చేసుకుందని పేర్కొన్నారు. ఈ విజయాలను ప్రజలకు వివరించేందుకు నిర్వహిస్తున్న సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో పాటు కూటమి అగ్రనేతలు హాజరుకానున్నారని తెలిపారు. దామినేడులో జరిగే ఈ విజయోత్సవ సభకు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జయచంద్ర నాయుడు కోరారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి ప్రజల మద్దతు మరింత బలపడేలా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఎన్డీయే విజయోత్సవ సభను విజయవంతం చేయాలి-జయచంద్ర నాయుడు