శ్రీకాళహస్తి, జూన్ 11, (పున్నమి న్యూస్) : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి సమీపంలోని దామినేడు వద్ద జూన్ 12న నిర్వహించనున్న భారీ విజయోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గత రెండేళ్లుగా అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈ ప్రతిష్టాత్మక సభను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌తో పాటు కూటమి ముఖ్య నాయకులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు తెలియజేసే వేదికగా ఈ సభ నిలవనుందని ఆయన అన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల మద్దతు మరింత బలపడేలా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఎన్డీయే విజయోత్సవ సభకు భారీగా తరలిరండి-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి