ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరుస్తున్నారని ఆరోపించింది.
కాంగ్రెస్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో ఏర్పడిన ప్రజాస్వామ్య వ్యవస్థలు, సంస్థలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలబెట్టాలని కోరారు.
ఈ వ్యాఖ్యలతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ వాదోపవాదాలు మరింత వేడెక్కాయి.


