Thursday, 11 June 2026
  • Home  
  • *ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కాబోతున్నాయి*
- ఆంధ్రప్రదేశ్

*ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కాబోతున్నాయి*

*ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కాబోతున్నాయి* *ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవంగా ముగియనుంది. అధికార కూటమికి అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ ఉండటంతో తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు, జనసేన పార్టీకి చెందిన ఒక అభ్యర్థి పోటీ లేకుండానే రాజ్యసభకు ఎన్నిక కానున్నారు* *తెలుగుదేశం పార్టీ తరఫున సానా సతీష్ బాబు, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్‌లను అభ్యర్థులుగా ప్రకటించగా, జనసేన పార్టీ తరఫున లింగమనేని రమేష్ బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సరికి ఇతర పార్టీల నుంచి ఎవరూ పోటీలో లేకపోవడంతో ఈ నలుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పష్టమైంది.* *2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో రాజ్యసభ స్థానాలన్నింటినీ కైవసం చేసుకునే స్థాయిలో సంఖ్యాబలం లభించింది* *టీడీపీకి మూడు స్థానాలు, మిత్రపక్షమైన జనసేనకు ఒక స్థానం కేటాయించారు. జనసేన పార్టీకి రాజ్యసభలో ఇదే తొలి ప్రాతినిధ్యం కావడం విశేషం*

*ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కాబోతున్నాయి*

*ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవంగా ముగియనుంది. అధికార కూటమికి అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ ఉండటంతో తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు, జనసేన పార్టీకి చెందిన ఒక అభ్యర్థి పోటీ లేకుండానే రాజ్యసభకు ఎన్నిక కానున్నారు*

*తెలుగుదేశం పార్టీ తరఫున సానా సతీష్ బాబు, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్‌లను అభ్యర్థులుగా ప్రకటించగా, జనసేన పార్టీ తరఫున లింగమనేని రమేష్ బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సరికి ఇతర పార్టీల నుంచి ఎవరూ పోటీలో లేకపోవడంతో ఈ నలుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పష్టమైంది.*

*2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో రాజ్యసభ స్థానాలన్నింటినీ కైవసం చేసుకునే స్థాయిలో సంఖ్యాబలం లభించింది*

*టీడీపీకి మూడు స్థానాలు, మిత్రపక్షమైన జనసేనకు ఒక స్థానం కేటాయించారు. జనసేన పార్టీకి రాజ్యసభలో ఇదే తొలి ప్రాతినిధ్యం కావడం విశేషం*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.