ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 8 (పున్నమి ప్రతినిధి)
రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మనుబోలు రెవెన్యూ కార్యాలయం వద్ద వీఆర్వోలు నిరసన చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న వీఆర్వో మహమ్మద్ హుస్సేన్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ అధికారుల ఒత్తిడి, అధిక పనిభారం కారణంగా వీఆర్వోలు మానసిక ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. అనవసర టార్గెట్లు, ఒత్తిళ్లు తగ్గించాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు నాగార్జున రెడ్డి, గుణశేఖర్, నాగేశ్వరరావు, శ్రీనివాసులు, మురళీధర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

వీఆర్వో మహమ్మద్ హుస్సేన్ కుటుంబానికి న్యాయం చేయాలి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 8 (పున్నమి ప్రతినిధి) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మనుబోలు రెవెన్యూ కార్యాలయం వద్ద వీఆర్వోలు నిరసన చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న వీఆర్వో మహమ్మద్ హుస్సేన్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ అధికారుల ఒత్తిడి, అధిక పనిభారం కారణంగా వీఆర్వోలు మానసిక ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. అనవసర టార్గెట్లు, ఒత్తిళ్లు తగ్గించాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు నాగార్జున రెడ్డి, గుణశేఖర్, నాగేశ్వరరావు, శ్రీనివాసులు, మురళీధర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

