ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 8 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ రమాదేవి మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆన్లైన్లో నమోదు చేసి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రీవెన్స్ డే నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ ప్రదీప్ కుమార్, పంచాయతీ శాఖ ఏఈ నాయక్, సూపరింటెండెంట్ ముజుమునిషా తదితరులు పాల్గొన్నారు.

గ్రీవెన్స్ డేతో సమస్యల పరిష్కారం – తాసిల్దార్ రమాదేవి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 8 (పున్నమి ప్రతినిధి) మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ రమాదేవి మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆన్లైన్లో నమోదు చేసి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రీవెన్స్ డే నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ ప్రదీప్ కుమార్, పంచాయతీ శాఖ ఏఈ నాయక్, సూపరింటెండెంట్ ముజుమునిషా తదితరులు పాల్గొన్నారు.

