పున్నమి: జూన్ 07 తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది. ఈ కొత్త క్యాలెండర్ ప్రకారం ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు మొత్తం 227 పని దినాలు ఉంటాయని స్పష్టం చేసింది. అలాగే 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 28, 2027 లోగా సిలబస్ మొత్తాన్ని పూర్తి చేయాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. పండుగ సెలవుల విషయానికి వస్తే ఈ ఏడాది కూడా దసరా పండుగకు సుదీర్ఘ సెలవులు లభించనున్నాయి. అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు మొత్తం 13 రోజుల పాటు దసరా సెలవులను ప్రకటించారు. సంక్రాంతికి మాత్రం జనవరి 13 నుంచి జనవరి 17 వరకు 5 రోజుల పాటు సెలవులు ఉంటాయని క్యాలెండర్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 23 చివరి వర్కింగ్ డే కానుంది. ఆ మరుసటి రోజు నుంచి జూన్ 13 వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ఉంటాయని వెల్ల డించింది. ఈ క్యాలెండర్ అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు వర్తిస్తుందని పేర్కొంటూ.. నిబం ధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించింది.

విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ విడుదల