Sunday, 7 June 2026
  • Home  
  • ఆండ్రేవారిపాలెంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్.. పత్రాలు లేని వాహనాలపై చర్యలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆండ్రేవారిపాలెంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్.. పత్రాలు లేని వాహనాలపై చర్యలు

వరికుంటపాడు పోలీసుల ఆధ్వర్యంలో ఆండ్రేవారిపాలెం గ్రామంలో ఆదివారం విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 39 మంది పోలీసు సిబ్బంది పాల్గొని గ్రామంలోని ఇళ్లు, వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీల సందర్భంగా 30 ద్విచక్ర వాహనాలు, 2 ఆటో రిక్షాలకు సంబంధించిన పత్రాల్లో అక్రమతలు గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టారు. అనంతరం గ్రామస్తులకు రోడ్డు భద్రతా నిబంధనలు, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, మహిళలు మరియు చిన్నారుల రక్షణకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.