బీహార్ ప్రభుత్వం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవికి కల్పిస్తున్న జెడ్ ప్లస్ భద్రతను ఉపసంహరించుకుంది. భద్రతా సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్, ఎంపీ మీసా భారతి, రాజశ్రీ యాదవ్‌లకు ప్రస్తుతం ఉన్న వై ప్లస్ భద్రత కొనసాగించనున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులకు అందిస్తున్న భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన తర్వాత ఈ మార్పులు చేపట్టినట్లు సమాచారం. భద్రతా అంశాలను రాజకీయ కోణంలో చూడకూడదని, పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయం బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

లాలూ ప్రసాద్‌కు జెడ్ ప్లస్ భద్రత తొలగింపు