Saturday, 6 June 2026
  • Home  
  • బీజేపీ దుత్తలూరు మండల కమిటీ నియామకాలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బీజేపీ దుత్తలూరు మండల కమిటీ నియామకాలు

దుత్తలూరు Date06-6-2026( ఉస్మాన్ పున్నమి ప్రతినిధి ) దుత్తలూరు: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సంస్థాగత బలోపేతానికి దుత్తలూరు మండలంలో కీలక నియామకాలు చేపట్టింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీచందర్ గారి ఆదేశాలతో జరిగిన సమావేశంలో పార్టీ వివిధ అనుబంధ విభాగాలకు నూతన బాధ్యులను నియోజకవర్గం ఇంచార్జి బెల్లంకొండ మాల్యాద్రి గారి అద్వర్యం లో కమిటీలు నియామకం జరిగింది . ఈ సందర్భంగా బీజేవైఎం (భారతీయ జనతా యువ మోర్చా) దుత్తలూరు మండల అధ్యక్షుడిగా పేమ్మసాని వేణుగోపాల్, జనరల్ సెక్రటరీగా నాగార్జున, అలాగే బీజేపీ మహిళా మోర్చా దుత్తలూరు మండల అధ్యక్షురాలిగా సురే మమతాలను నియమించినారు . నూతనంగా నియమితులైన నాయకులకు నియామక పత్రాలు అందజేసిన ఉదయగిరి నియోజకవర్గం ఇంచార్జి బెల్లంకొండ మాల్యాద్రి గారు మాట్లాడుతూ , పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువత, మహిళలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో దుత్తలూరు మండల అధ్యక్షుడు లెక్కల వెంగళరెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్, బీజేపీ సీనియర్ నాయకుడు గడ్డం ప్రసాద్ గారు మరియు జిల్లా, మండల స్థాయి నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన నాయకులు పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, దుత్తలూరు మండలంలో బీజేపీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.

దుత్తలూరు
Date06-6-2026( ఉస్మాన్ పున్నమి ప్రతినిధి )
దుత్తలూరు: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సంస్థాగత బలోపేతానికి దుత్తలూరు మండలంలో కీలక నియామకాలు చేపట్టింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీచందర్ గారి ఆదేశాలతో జరిగిన సమావేశంలో పార్టీ వివిధ అనుబంధ విభాగాలకు నూతన బాధ్యులను నియోజకవర్గం ఇంచార్జి బెల్లంకొండ మాల్యాద్రి గారి అద్వర్యం లో కమిటీలు నియామకం జరిగింది .
ఈ సందర్భంగా బీజేవైఎం (భారతీయ జనతా యువ మోర్చా) దుత్తలూరు మండల అధ్యక్షుడిగా పేమ్మసాని వేణుగోపాల్, జనరల్ సెక్రటరీగా నాగార్జున, అలాగే బీజేపీ మహిళా మోర్చా దుత్తలూరు మండల అధ్యక్షురాలిగా సురే మమతాలను నియమించినారు .
నూతనంగా నియమితులైన నాయకులకు నియామక పత్రాలు అందజేసిన ఉదయగిరి నియోజకవర్గం ఇంచార్జి బెల్లంకొండ మాల్యాద్రి గారు మాట్లాడుతూ , పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువత, మహిళలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో దుత్తలూరు మండల అధ్యక్షుడు లెక్కల వెంగళరెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్, బీజేపీ సీనియర్ నాయకుడు గడ్డం ప్రసాద్ గారు మరియు జిల్లా, మండల స్థాయి నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
నూతన బాధ్యతలు స్వీకరించిన నాయకులు పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, దుత్తలూరు మండలంలో బీజేపీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.