శ్రీ కాళహస్తి, జూన్ 04, (పున్నమి న్యూస్) : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు గురువారం శ్రీకాళహస్తి మండలం వాంపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి సూచనల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం, రైతు భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి పథకాల్లో ప్రజలకు అన్యాయం జరిగిందని విమర్శించారు. రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం, పెన్షన్ పథకాల అమలులోనూ పరిమితులు విధించారని ఆరోపించిన ఆయన, ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిలో కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నిరసన