వృద్ధుల సంక్షేమమే లక్ష్యం
వై.జె. పద్మశ్రీ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు జి. శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు, కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి గౌరవనీయులు శ్రీమతి వై.జె. పద్మశ్రీ గారి ఆధ్వర్యంలో కొత్తూరులోని నెహ్రూ భారతీ వృద్ధుల ఆశ్రమంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులను నిర్లక్ష్యం చేయడం హేయమైన చర్య అని పేర్కొంటూ, తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్ల పోషణ, సంక్షేమ చట్టం–2007 గురించి అవగాహన కల్పించారు. ఆశ్రమంలోని వసతి, భోజనం, వైద్య సదుపాయాలపై వివరాలు తెలుసుకుని, ఆధార్, రేషన్ కార్డులు లేని వారికి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వృద్ధులకు అరటిపండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేనేజర్ షాహిద్, పేరా లీగల్ వాలంటీర్ పెంచల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
Uploaded Video:



