ఏన్కూరులో కుండపోత వర్షం: ఎంపీడీవో కార్యాలయం ముందు విరిగిపడిన చెట్లు, తప్పిన ప్రమాదం.
ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. వర్షంతో పాటు వీచిన ఈదురుగాలులు బీభత్సం సృష్టించడంతో స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని భారీ వృక్షాలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో తృటిలో పెనుప్రమాదం తప్పింది. అయితే, చెట్ల కింద పార్క్ చేసి ఉన్న పలు ద్విచక్ర వాహనాలు ఈ ఘటనలో స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా కురిసిన ఈ భారీ వర్షానికి రోడ్లపైన ఉన్న గుంతలన్నీ జలమయమవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కాగా, జూన్ మొదటి వారంలోనే ఆశించిన స్థాయిలో ముందస్తు వర్షాలు కురవడంతో రాబోయే ఖరీఫ్ సీజన్ పనులకు అనుకూలంగా ఉంటుందని స్థానిక రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.
Uploaded Video:



