రంగాపూర్ గ్రామంలో రూ.24 లక్షల సీసీ రోడ్డుకు శంకుస్థాపన
రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, రంగాపూర్ గ్రామం:
పున్నమి న్యూస్
30 మే 2026
తెలంగాణ ఇంచార్జి
రంగాపూర్ గ్రామ సర్పంచ్ నేనావత్ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు గ్రామ అభివృద్ధికి సంబంధించిన ముఖ్య కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. స్థానిక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శ్రీ గుడిబండ రామలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే రహదారికి రూ.24 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు గ్రామంలో ఉన్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన పనులను దశలవారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజల అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన నిధులు మంజూరు చేయించే దిశగా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ యాదగిరి, వార్డ్ సభ్యులు అజయ్ బాస్, నేనావత్ లక్ష్మీ, ఇటిక్యాల దివ్య, చింతపల్లి మనిత, పంచాయతీ కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, మాజీ ఉపసర్పంచ్‌లు కుకుడాల జంగారెడ్డి, పూన్ రెడ్డి మాధవ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గ్రామ అభివృద్ధికి సంబంధించిన ఈ కార్యక్రమం గ్రామ ప్రజల్లో ఆనందాన్ని నింపింది.





