గౌడ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా నూతన కమిటీ జిల్లా పర్యటనలో భాగంగా కోవూరు మండలం మోడేగుంట గ్రామం గమల్లపాలెం నందు శనివారము సాయంత్రం 6 గంటలకు పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పరిచయ కార్యక్రమంలో నూతన జిల్లా కమిటీని గౌడ కులస్తులు ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తిరకాల. సీనయ్య గౌడ్ మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో గౌడ కులస్తుల జనాభా చాలా ఎక్కువగా ఉందని అలాగే రాజకీయంగా చైతన్యవంతమైందని మండల, జిల్లా, రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే నాయకులు ఇక్కడి నుంచి ఎదగాలని యువత అన్ని రంగాలలో విజయాలు సాధించాలని విద్యార్థులు విద్యారంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. అలాగే రాబోవు రోజుల్లో తాడి ఫెస్టివల్ మరియు తాటికల్లు మేళాలు నిర్వహిస్తామన్నారు.
అలాగే మహిళలు, యువత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందాలని గౌడ్ గీత కార్మికులు, వృద్దులు, వితంతువులు, వికలాంగులు, పెన్షన్లు తీసుకోవాలని గీత కార్మికులు విధిగా లైసెన్సులు పొందాలని గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని గ్రామాలలో సొసైటీల ఏర్పాటుకు పాటుపడతామని సొసైటీ భవనాల నిర్మాణం కోసం కృషి చేస్తామని తెలిపారు. అలాగే నిరుద్యోగ యువత పారిశ్రామికంగా వ్యాపార పరంగా నిలదొక్కుకోవాలని మద్యం బెల్ట్ షాపులో నిరోధానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని గ్రామ గ్రామాన గౌడ్లను సమీకరించి వారిని జాగృతం చేసి సమర్థవంతమైన నాయకులగా తయారు చేస్తామన్నారు. జాతీయ నాయకులలో స్ఫూర్తితో పని చేయాలని సర్దార్ సర్వాయి. పాపన్న గౌడ్, గౌతు. లచ్చన్న గౌడ్ వారసత్వాన్ని అందుపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
తాను గౌడ కులంలో పుట్టినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నానని నూతన గౌడ సంఘం కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో నాయకులను తయారు చేసే కర్మాగారంగా తయారవ్వాలి అన్నారు. అట్లాగే గౌడ్లు అన్ని రంగాలలో ఎదుగుదలకు తమవంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తామని చెప్పారు.
పై కార్యక్రమంలో నాయకులు అన్నం. దయాకర్ గౌడ్, , జడపల్లి. రాజారాం గౌడ్, ఎంపులూరు భాస్కర్ గౌడ్, ఏపూరి. రమేష్ గౌడ్, ముక్కు. రాధాకృష్ణ గౌడ్, మారు బోయిన శ్రీనివాసులు గౌడ్, దాసరి. రాజేంద్ర గౌడ్ ,ఉప్పల. శ్రీహరి గౌడ్, తిరకాల మోహన్ బాబు గౌడ్ దద్దోలు పవన్ తేజ గౌడ్, దాసరి హేమంత్ గౌడ్, దోర్నాధుల పవన్ కుమార్ గౌడ్, దాసరి లీలావతి దాసరి మురళి గౌడ్ వీరంకి నాగుల గౌడ్ దాసరి రమేష్ గౌడ్ తాతా సుబ్రహ్మణ్యం గౌడ్ బండ్ల మురళి గౌడ్ బండ్ల కిరణ్ గౌడ్ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

