దేశంలోని అన్ని హైకోర్టులు కేసుల్లో తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత మూడు నెలల్లోపు తీర్పు వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.
బెయిల్ కేసుల్లో వీలైనంత త్వరగా తీర్పు ఇవ్వాలని, బెయిల్ మంజూరైన ఖైదీలను అదే రోజు లేదా మరుసటి రోజే విడుదల చేయాలని సూచించింది. అలాగే హేబియస్ కార్పస్, కూల్చివేతల వంటి అత్యవసర కేసుల్లో తీర్పు తక్షణమే వెల్లడించాలని పేర్కొంది.
న్యాయ వ్యవస్థలో జాప్యాలను తగ్గించి ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించడమే ఈ నిర్ణయం లక్ష్యమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


