వంగూరు: మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, అదనపు కలెక్టర్ దేవసహాయం ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. సర్పంచి అధ్యక్షతన జరిగిన ఈ సభలో గ్రామంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులు సుదీర్ఘంగా సమీక్షించారు. పనులను నాణ్యతతో, సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు వివిధ శాఖలకు చెందిన మండల, జిల్లా స్థాయి అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


