జాతీయ సృజనాత్మక దినోత్సవాన్ని 2018 లో ప్రారంభించారు. దీనిని ప్రముఖ స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్ అయిన హాల్ క్రోస్మన్ మరియు ఆయనకు చెందిన ‘స్క్రీన్రైటింగ్ యూ’ అనే సంస్థ సంయుక్తంగా ప్రారంభించాయి. ప్రతి సంవత్సరం మే 30వ తేదీన ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దైనందిన జీవితంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ప్రతి ఒక్కరిలో దాగి ఉన్న ఊహాశక్తిని, వినూత్న ఆలోచనలను బయటకు తీసి, వారి సృజనాత్మక సామర్థ్యాన్ని పెంపొందించుకునేలా ఈ రోజు ప్రేరణనిస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రపంచ సృజనాత్మకత మరియు ఆవిష్కరణ దినోత్సవం ఏప్రిల్ 21న జరుపుకుంటారు. ఈ సందర్భంగా పాఠకుల కోసం ఈ సృజనాత్మక కవిత
🌷🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌷
ప్రకృతి ప్రపంచంలో పచ్చదనాల పునాదులు చెట్లు
అవి అందించు చెక్కలతో అందమైన అలమారాలు
కలపల పడకల ప్రాకారాలు ఎన్నెన్నో గృహోపకరణాలు
తోటలిచ్చు పువ్వులు కాయలతో అలంకరణలు
ఆహార విందు వినోదాల వైవిధ్య తోరణాలు
కళాత్మక దృశ్య ప్రదర్శనల ఆహ్లాద భరిత అనురాగాలు
రాళ్లు మట్టి నుండి సిమెంట్ కాంక్రీట్ వరకు
పూరి గుడిసెల నుండి ఆధునిక భవన నిర్మాణాల వరకు
ఎడ్లబండ్ల నుండి స్వయంచాలక యంత్రాల వరకు
సాధారణ ఆవాసం నుండి విలాస నివాసం వరకు
జీవనావసర కదలికల నుండి విహార ప్రయాణం వరకు
జీవావరణ భావాల నుండి గ్రహాంతర పరిశోధనల వరకు
సంపద సృష్టికి ప్రయత్నం నిరంతరం
సాంకేతిక పరిజ్ఞాన వినియోగం తరంతరం
జీవన ప్రయాణ గమనం సులభతరం
పనివేగం గరిష్టంగ కనిష్ఠ వ్యయ ఉత్పాదనం
ప్రాణికోటికి సమాచార పరిజ్ఞాన ప్రయోజనం
విజ్ఞాన సమూపార్జన సుఖమయ జీవన విధానం
కృత్రిమక్రాంతులు సూర్య క్రాంతి శోభిత ఆపాదనం
నింగీ నేలకను కలిపే సోపాన పరిణామ వీక్షణం
ఆహ్లాద భరితం స్పందించు హృదయ ప్రబోధనం
ఆహార లభ్యతకై అనుకరణ నవకల్పనలు
ఆహార భద్రతకు చేపట్టు ప్రభుత్వ సంస్కరణలు
ప్రజా జీవనగమన ఆగమన మధురిమలు
విశ్వ మానవ ప్రయత్న క్రియాత్మక ఫలితం లో
జీవవైవిధ్య విలక్షణ సంరక్షణ విజితం లో
మొత్తంగా ఏకాత్మక భావనలో…
సృష్టిలో అనుభవాల అనుకరణకు ప్రతిష్టాత్మకత సృజనాత్మకత
🌹🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌹

