ప్రగడ నాగేశ్వరావు నేతృత్వంలో ఏటికొప్పాక నుంచి భారీ శక్తి ప్రదర్శన – పసుపు దండుతో దద్దరిల్లిన మహానాడు
( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ )
అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి నియోజకవర్గం:
తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు రెండో రోజు కార్యక్రమం రాజకీయ ఉత్సాహంతో కళకళలాడింది. ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రగడ నాగేశ్వరావు ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ విజయబాబు, మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి నాయకత్వంలో ఏటికొప్పాక గ్రామం నుంచి భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహానాడుకు తరలివెళ్లారు.
మహానాడు సభా ప్రాంగణం మొత్తం పసుపు జెండాలు, “జై తెలుగు దేశం” నినాదాలతో మార్మోగిపోయింది. గ్రామ స్థాయి నుంచి పార్టీకి పెరుగుతున్న ప్రజాభిమానాన్ని కార్యకర్తల హాజరు మరోసారి స్పష్టం చేసింది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పాలన, యువతకు ఉపాధి, గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భజంత్రీల లక్ష్మి, సర్పంచ్ కుమారుడు శ్రీను, కర్రీ సింహాచలం, దేవరపు మోహన్, ఊడి రామకృష్ణ, వెంకటేష్, ఈశ్వరరావు, పోలిశెట్టి, అట్టా కాసులమ్మ, నాని, శెట్టి సత్తిబాబు, పోలు మూరు నాగేశ్వరావు, బాబాజీ, రమణ, బి.శ్రీను, బుజ్జి, కిషోర్, ఏసు, పి.శ్రీను, డి.రాజు, నాగేశ్వరరావు, కె.ప్రభాకర్ రావుతో పాటు అధిక సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
“రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీనే ప్రజల ఆశ” అంటూ కార్యకర్తలు మహానాడు వేదికను నినాదాలతో హోరెత్తించారు


