కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విజయవాడలో భారతదేశపు తొలి సూపర్ ప్రెజర్ బెలూన్ ను ఆవిష్కరించారు. ‘రెడ్ బెలూన్ ఏరో స్పేస్’ రూపొందించిన ఈ బెలూన్ 50 కిలోల పేలోడ్‌ను మోయగలదు. ఇది ఇంటర్నెట్ లేని గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీని అందిస్తుంది.
స్ట్రాటోస్పియర్‌లో ఎక్కువ రోజులు ప్రయాణించే ఈ సాంకేతికత టెలికమ్యూనికేషన్స్, అంతరిక్ష పరిశోధనలు మరియు పారిశ్రామిక కారిడార్ల పర్యవేక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. రాబోయే పదేళ్లలో భారత స్పేస్ పరిశ్రమ 40 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.


