కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చే మూడు వారాల్లో దేశ సరిహద్దు ప్రాంతాలను సందర్శించనున్నారు. రాజస్థాన్ నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులను సమీక్షించనున్నారు. సరిహద్దు భద్రతా దళం (BSF) అధికారులతో సమావేశాలు నిర్వహించడంతో పాటు మహిళా సిబ్బంది కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. సరిహద్దు భద్రత మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర అధికారులతో కూడా చర్చలు జరపనున్నట్లు సమాచారం.

సరిహద్దు ప్రాంతాల్లో అమిత్ షా పర్యటన