Tuesday, 26 May 2026
  • Home  
  • జీతాలు పెంచాల్సిందే: అధికారుల ప్రతిపాదనను తిరస్కరించిన సిఐటియు (CITU) కార్మికులు.
- News

జీతాలు పెంచాల్సిందే: అధికారుల ప్రతిపాదనను తిరస్కరించిన సిఐటియు (CITU) కార్మికులు.

కృష్ణపట్నంలోని ఎస్ఈఐఎల్ (SEIL) ఎనర్జీ ఇండియా లిమిటెడ్ ప్రాజెక్టు కార్మికులు చేపట్టిన శాంతియుత ఆందోళన సోమవారానికి ఎనిమిదో రోజుకు చేరింది. కనీస వేతన చట్టం ప్రకారం ప్రతి కార్మికుడికి నెలకు ₹26,000 జీతం ఇవ్వాలని, కార్మికులను ఉద్యోగులుగా గుర్తించి ప్రాథమిక వసతులు కల్పించాలని సిఐటియు (CITU) ఆధ్వర్యంలో వారు డిమాండ్ చేస్తున్నారు. గత 15 ఏళ్లుగా పనిచేస్తున్న 360 మంది కార్మికుల సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులు, అధ్యక్షులు టీవీపీ ప్రసాద్ మండిపడ్డారు. ఐదు రోజుల గడువిస్తే సమస్య పరిష్కరిస్తామన్న ప్రాజెక్టు అధికారుల ప్రతిపాదనను కార్మికులు తిరస్కరించారు. వేతనాలు పెంచుతామని స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు విధులకు హాజరయ్యేది లేదని కార్మికులు భీష్మించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.