మర్రిపాడు, దుత్తలూరు
Date26-5-2026(ఉస్మాన్ పున్నమి ప్రతినిది )
నందిపాడు – ఎపిలకుంట జాతీయ రహదారి (NH 565) పై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓబుల్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికుల వివరాల ప్రకారం, ఓబుల్ రెడ్డి ఉపాధి పనుల నిమిత్తం ఉదయం బైక్‌పై వెళ్తుండగా, వేగంగా వచ్చిన ఓ కారు ఆయన బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో ఓబుల్ రెడ్డి తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, హైవే సిబ్బంది మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. రహదారిపై అతివేగం కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.
ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

నందిపాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
మర్రిపాడు, దుత్తలూరు Date26-5-2026(ఉస్మాన్ పున్నమి ప్రతినిది ) నందిపాడు – ఎపిలకుంట జాతీయ రహదారి (NH 565) పై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓబుల్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం, ఓబుల్ రెడ్డి ఉపాధి పనుల నిమిత్తం ఉదయం బైక్‌పై వెళ్తుండగా, వేగంగా వచ్చిన ఓ కారు ఆయన బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో ఓబుల్ రెడ్డి తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, హైవే సిబ్బంది మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. రహదారిపై అతివేగం కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

