ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. “సంజీవని” ప్రాజెక్ట్‌లో భాగంగా గ్రామాల్లో డిజిటల్ హెల్త్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఏఐ ఆధారిత వైద్య సేవలు, మొబైల్ మెడికల్ యూనిట్లు, గ్రామ స్థాయి ఆరోగ్య కేంద్రాల బలోపేతంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. గ్రామీణ ప్రజలు చిన్న సమస్యలకే పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వైద్య సదుపాయాలు కల్పించనున్నారు.
ప్రభుత్వం ఆరోగ్య రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతోందని అధికారులు తెలిపారు. టెలీమెడిసిన్ సేవలు భవిష్యత్తులో ఆరోగ్యరంగంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


