ఖమ్మం, మే
జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రతతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఖమ్మం నగరంలోని ప్రధాన కూడలి అయిన గట్టయ్య సెంటర్–బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జంక్షన్ పూర్తిగా నిర్మానుష్యంగా కనిపించింది. సాధారణ రోజుల్లో వాహనాలు, ప్రజల రద్దీతో కిటకిటలాడే ఈ ప్రాంతం ఎండ వేడికి వెలవెలబోయింది.
ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో ప్రజలు అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావడం లేదు. వ్యాపార సంస్థలు, దుకాణాల వద్ద కూడా సందడి తగ్గింది. వాతావరణ శాఖ సూచనల మేరకు ప్రజలు మధ్యాహ్న వేళల్లో బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో తీవ్ర వడగాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో తగినంత నీరు తాగుతూ, అవసరమైతేనే బయటకు రావాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖమ్మంలో ఇటీవల 45°C వరకు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
Uploaded Video:



